India-China Conflict: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని పేర్కొనింది. అయితే, భారత భూభాగంలోని ప్రదేశాల పేరు మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు.
Read Also: Health Tips : పసుపు, తేనె కలిపి తీసుకుంటే..ఎన్ని లాభాలో తెలుసా !
అయితే, గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్ పై తన వాదనను చాటుకునేందుకు చైనా పదే పదే ప్రయత్నించింది. గత ఏడాది ఏప్రిల్ లో కూడా అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉన్న పలు ప్రదేశాలకు 30 కొత్త పేర్లతో కూడిన నాల్గవ జాబితాను చైనా రిలీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను బీజింగ్ జాంగ్నాన్ గా డ్రాగన్ కంట్రీ గుర్తిస్తుందని గ్లోబల్ టైమ్స్ నివేదించింది.