Chhattisgarh: మరోసారి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం నక్సలైట్లు , భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 25 లక్షల రివార్డ్ కలిగిన టాప్ కమాండర్‌తో సహా ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు.
నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు 'నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఎదురుగాల్పులు జరుగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మావోల శిబిరాన్ని డీఆర్‌జీ సైనికులు ధ్వంసం చేశారు.
దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు.. మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు పలువురు మావోలను మట్టుబెట్టారు. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిపారు. Also Read:CM…
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి. డీఆర్‌జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉదయం నుండి ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వారి ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశంలో…
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రోడ్డుపై ఒక రష్యన్ అమ్మాయి చేసిన హై డ్రామా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీఐపీ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వస్తున్న ఇండిగో కారు యాక్టివాను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ముగ్గురు యువకులు ఉన్నారు. కారు ఢీకొన్న తీరు చాలా తీవ్రంగా ఉండటంతో స్కూటర్ నడిపే వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయాడు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని…
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా... మావోలు మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు.