Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం
- ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్
- 20 మంది మావోయిస్టులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో పచ్చని అడవి రక్తసిక్తమైంది. శనివారం సుక్మా జిల్లాలోని ఉపంపల్లిలోని గోగుండ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు 20 మంది మావోలు చనిపోగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సుక్మా చరిత్రలో భద్రతా దళాలకు ఇది భారీ విజయంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం. సీఆర్పీఎఫ్ జవాన్లు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సుక్మా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. భారీగానే మావోలు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
3 నెలల కాలంలో ఇప్పటి వరకు 100 మంది మావోలు చనిపోయారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా దళాలు ఈ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారు.
మావోల దుశ్చర్య
ఇదిలా ఉంటే బీజాపూర్ జిల్లాలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉసుపరి గ్రామంలోని నదిలో ఐఈడీ బాంబు పేల్చారు. భద్రతా దళాల లక్ష్యంగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ప్రాథమిక చికిత్స కోసం భైరంగఢ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!