Bijapur: 19 మంది మావోలు లొంగుబాటు.. 9 మందిపై రూ.28 లక్షల రివార్డ్
- బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగుబాటు
- 9 మందిపై రూ. 28 లక్షల రివార్డు
- పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగుబాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు. వారు తమ మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ చెందడం, సీనియర్ క్యాడర్లు అమాయక గిరిజనులను దోపిడీ చేయడం, నిషేధిత సంస్థలో పెరుగుతున్న విభేదాల కారణంగా వారు లొంగిపోయినట్లు చెప్పారు. కాగా.. ఈ విషయాన్ని బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లందరూ ఆంధ్ర ఒడిశా బోర్డర్ (AOB) డివిజన్, మావోయిస్టుల పామెడ్ ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో ఉన్నారని యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Ashwini Vaishnav: ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
లొంగిపోయిన నక్సలైట్లలో దేవ పదం (30), అతని భార్య దులే కలాము (28) మావోయిస్టు బెటాలియన్ నంబర్ 1లో సీనియర్ సభ్యులుగా ఉంది. వారి తలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. ఇక, ఏరియా కమిటీ సభ్యుడు సురేష్ కట్టం (21) తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. అలాగే లొంగిపోయిన నక్సలైట్లలో ఒక్కో తలపై రూ. 2 లక్షల రివార్డు ఉండగా, ఐదుగురు నక్సలైట్ల తలపై ఒక్కొక్కరికి రూ. 1 లక్ష రివార్డు ఉంది.
Read Also: Tollywood: హీరోలు అందరూ ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా?
కాగా.. నక్సలైట్లు లొంగిపోవడంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), CRPF, COBRA (కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్) కీలక పాత్ర పోషించాయని జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన ప్రతి నక్సలైటుకూ రూ. 25,000 సహాయం అందించామని అన్నారు. వారికి పునరావాసం కల్పిస్తామని జితేంద్ర కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటివరకు బస్తర్ రేంజ్‌లోని బీజాపూర్ జిల్లాలో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. గత సంవత్సరం, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాలలో మొత్తం 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!