Namaz: ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) క్యాంపులోని విద్యార్థులతో ఓ ప్రొఫెసర్ బలవంతంగా నమాజ్ చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో 8 మందిపై ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదైంది.
Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు…
CRPF: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. గత 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఘనవిజయం సాధించింది. మావోయిస్టుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అడవుల్లో కష్టమైన ప్రదేశాలను గుర్తించి సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ స్వయంగా కర్రెగుట్ట…
ఆపరేషన్ కర్రిగుట్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..చతిస్గడ్ తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ..కర్రెగుట్టలే టార్గెట్‌గా భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి.. వేలమంది భద్రత బలగాలు ఇప్పుడు కర్రే గుట్టల వైపు దూసుకొనికుని వెళ్తున్నాయి.. ఏ క్షణం లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది.. అంతేకాకుండా వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రిగుట్టలో భారీ ఆపరేషన్ జరుగుతుంది.. హత్యకాండను వెంటనే ఆపాలని పౌరసంగాలు డిమాండ్ చేస్తున్నాయి.. ఈమెరకు పౌర సంఘాలు ఏకంగా సమావేశం…
మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. భద్రతా బలగాలు మావోలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లా బేధారే పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్పె-తొడ్సంపార అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో గుండిపురి RPC మిలిషియా ప్లాటూన్ కమాండర్ వెల్లా వాచమ్ అనే మావోయిస్టు మృతి చెందాడు ఇతనిపై మూడు లక్షల రివార్డు ఉన్నది. Also Read:YS Jagan: యుద్ధ వాతావరణంలోనే వైసీపీ పుట్టింది.. ఆ తర్వాత కూడా యుద్ధమే..! ఛత్తీస్‌గఢ్ సాయుధ…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తన వర్కర్లపై కర్కషంగా ప్రవర్తించాడు. ఇద్దరు కార్మికులను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశాడు. దొంగతనం చేశారనే అనుమానంతో వారిద్దరికి కరెంట్ షాక్‌లు ఇస్తూ, గోళ్లు ఊడపీకి హింసించాడని శనివారం పోలీసులు తెలిపారు. రాజస్థాన్ భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి అనే ఇద్దరు బాధితులను ఒక కాంట్రాక్టర్ ద్వారా కోర్బా జిల్లాలోని గుర్జార్ యాజమాన్యంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నియమించుకున్నారు.
కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
Maoists Surrender: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ రోజు ( ఏప్రిల్ 18న) 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందన్నారు పోలీసులు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొండగావ్-నారాయణ్‌పూర్ సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్ అగ్ర నేతలను భద్రతా దళాలు హతమార్చాయి.
India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల పనితీరు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. 32 సూచికల ఆధారంగా ఈ మదింపు జరిగింది, ఇందులో రాష్ట్రాలను రెండు వర్గాలుగా విభజించారు: 10 మిలియన్లకు పైగా జనాభా కలిగిన 18 పెద్ద రాష్ట్రాలు మరియు 10 మిలియన్ల లోపు జనాభా కలిగిన 7 చిన్న రాష్ట్రాలు. తెలంగాణ, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6.48 పాయింట్లతో మొదటి స్థానంలో…