నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు ‘నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన వైఖరితో ముందుకు సాగుతోందని.. లొంగిపోవడం కోసం అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని మావోయస్టులు పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందని స్పష్టం చేశారు.
READ MORE: Botsa Satyanarayana: రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు..
ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో18 మంది మావోయిస్టులు హతం అయ్యారు. అలాగే ఒక జవాను కూడా చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఈ ఎదురుగాల్పులు జరిగాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్మద్‌లో మావోలు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడు కారణంగా ఒక జవాన్, ఒక అధికారి కళ్లలోకి దుమ్ము, బురద వెళ్లినట్లుగా తెలిపారు. చికిత్స కోసం వారిని వేరే ప్రాంతానికి తరలించారు.
READ MORE: Yogi Adiyanath: ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహమే.. ఔరంగజేబు వివాదంపై యోగి వార్నింగ్..