Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో బలరాంపూర్‌లో జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబా ముసుగులో హిందువును, సిక్కు మతం మార్చే పెద్ద రాకెట్ ముఠాకు ఈయన నాయకత్వం వహిస్తున్న విషయాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు.
Chhangur Baba: ఉత్తరప్రదేశ్‌ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగించింది. నవీన్ గతంలో యుపీ ఎటీఎస్ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు కోసం కోర్టులో కస్టడీ కోరగా, కోర్టు అందుకు ఆమోదించింది. ఇందులో భాగంగా…
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్‌గా దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్‌వర్క్‌ని స్థాపించాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, ఆ ముసుగులో అనేక అరాచకాలు చేస్తున్నాడు. ఈ కేసులో మతమార్పిడుల కోసం పలు ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్లు నిధులను సేకరించాడు. పేద, బలహీన హిందువులను టార్గెట్ చేస్తూ, లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వందల కోట్ల…
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక పద్ధతి ప్రకారం, లవ్ జీహాద్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విచారణలో తేలింది. హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చేందుకు పలువురు ముస్లిం యువకులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న విషయం వెల్లడైంది.
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు రోజురోజుకు వెలుగులోకి వస్తు్న్నాయి. హిందూ అమ్మాయిలే లక్ష్యంగ మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చంగూర్ బాబాకు మతమార్పిడిల కోసం మిడిల్ ఈస్ట్‌లోని పలు ఇస్లాం దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా మతమార్పిడిల కోసం వందల కోట్లు సేకరించినట్లు తేలింది.
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ యువతను ట్రాప్ చేసి, వారిని వివాహం చేసుకుని, ఇస్లాంలోకి మార్చాలనే పెద్ద నెట్‌వర్క్‌ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా ఛంగూర్ బాబా ఉన్నాడు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
Chhangur Baba: జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మత మార్పిడిలే లక్ష్యంగా ఈ ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు సంపాదించాడు. ముఖ్యంగా 40 బ్యాంక్ అకౌంట్లలో రూ. 106 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.