Chhangur Baba: ఉత్తరప్రదేశ్‌ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగించింది. నవీన్ గతంలో యుపీ ఎటీఎస్ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు కోసం కోర్టులో కస్టడీ కోరగా, కోర్టు అందుకు ఆమోదించింది. ఇందులో భాగంగా ఈడీ తాజా విచారణ ప్రకారం, చంగూర్ బాబా తన డబ్బులను నేరుగా తన పేరుపై కాకుండా నవీన్ రోహ్రా, అతని భార్య నీతూ రోహ్రా (అలియాస్ నస్రీన్) పేర్లపై ఆస్తులుగా వేసినట్లు గుర్తించారు.
Mizoram Capital: మిజోరాం రాజధాని మార్పు? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.!
ఇకపోతే, ఇప్పటికే గత నెలలో ఈడీ చంగూర్ బాబాను కూడా కస్టడీలోకి తీసుకుంది. బల్రాంపూర్ జిల్లా, ముంబయిలో రెండు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించగా, చంద్ ఔలియా దర్గాలో భారీగా అక్రమాలకు ఆధారాలు లభించాయి. అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం..చంగూర్ బాబా, అతని ముఠా మొత్తం 22 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.60 కోట్లకు పైగా నిధులు పొందినట్లు ఈడీ వెల్లడించింది. ఈ మొత్తం నిధుల్లో ఓ పెద్ద భాగం విదేశాల నుంచి వచ్చినవేనని తేలింది. చంగూర్ బాబా, అతని కుమారుడు మెహబూబ్, నవీన్ రోహ్రా, నీతూ రోహ్రా సహా నలుగురిపై యుపీ పోలీస్ గోమతి నగర్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు కొనసాగుతోంది.
Jair Bolsonaro: మాజీ అధ్యక్షుడుకి సుప్రీం కోర్ట్ షాక్.. హౌస్ అరెస్ట్‌కి ఆదేశాలు!
ఈ కుట్రలో దారుణమైన మతమార్పిడులు, విదేశీ నిధుల వినియోగం, జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్న కార్యకలాపాలున్నాయని ఎటీఎస్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇందులో ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే.. చంగూర్ బాబా ప్రధానంగా దళితులు, ఆర్థికంగా వెనుకబడ్డ హిందూ వ్యక్తులపై లక్ష్యంగా పెట్టుకుని మతమార్పిడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పక్రియ సజావుగా నడిచే వ్యవస్థగా మారిందని, భారీ మొత్తంలో నిధులు వసూలు చేసి లక్షల రూపాయల విలువైన భవనాలు కొనుగోలు చేసి నిర్మాణాలు కూడా చేపట్టారని ఈడీ వెల్లడించింది. ఈ అక్రమాలకు సంబంధించి బల్రాంపూర్‌లో ఉన్న చంగూర్ బాబా నిర్మించిన కొన్ని భవనాలను యూపీ ప్రభుత్వం ఇటీవల కూల్చివేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ చర్యలను సమర్థిస్తూ.. ఇవి కేవలం సామాజికంగా కాక, జాతీయంగా ప్రమాదకరమైన చర్యలుగా అభివర్ణించారు