Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక పద్ధతి ప్రకారం, లవ్ జీహాద్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విచారణలో తేలింది. హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చేందుకు పలువురు ముస్లిం యువకులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న విషయం వెల్లడైంది. గత మూడు సంవత్సరాలుగా హిందూ అమ్మాయిలను వలలో వేసుకోవడానికి 1000 మందికి పైగా ముస్లిం యువకులకు నిధులు సమకూర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Also: Radhika Yadav: రాధికా షార్ట్ ధరించినా, అబ్బాయిలతో మాట్లాడినా తండ్రి సహించేవాడు కాదు..
ఈ కాలంలోనే ముస్లిం దేశాల నుంచి ఛంగూర్ బాబా ముఠా ఏకంగా రూ. 500 కోట్లు స్వీకరించినట్లు తేలింది. ప్రస్తుతం, ఈ కేసును యూపీ ఎస్‌టీఎఫ్‌తో పాటు ఈడీ, ఎన్ఐఏలు విచారిస్తున్నాయి. అక్రమ పద్ధతిలో మతమార్పిడులకు పాల్పడుతున్న ఆరోపణలపై ఛంగూర్ బాబాపై యూపీ ఉగ్రవాద నిరోధక దళం (ATS) చర్యలు చేపట్టింది. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని యూపీలోని ఏడు జిల్లాల్లోని ముస్లిం యువకులకు చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. లవ్ జిహాద్ ద్వారా హిందూ బాలికలను ఆకర్షించిన ముస్లిం యువకులకు ఛంగూర్ బాబా నగదు చెల్లింపులు చేసినట్లు అధికారులు గుర్తించారు.
విదేశీ నిధుల మార్గాలను గుర్తించడానికి మరియు మరిన్ని సంబంధాలను వెలికితీసేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మరియు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఈ ఇద్దరినీ విచారించనున్నారు. ఛంగూర్ బాబా కుమారుడు నవీన్ అలియాస్ జమాలుద్దీన్, మెహబూబ్‌లను ఇప్పటికే అరెస్టు చేసి లక్నో జిల్లా జైలులో ఉంచారు. గత మూడేళ్లలో వీరిద్దరి అకౌంట్లకు పెద్ద ఎత్తున నిధులు వచ్చినట్లు గుర్తించారు. షార్జా, దుబాయ్‌లో ఛంగూర్ బాబా అనుమానిత అకౌంటన్లు పరిశీలిస్తున్నారు.