Chhangur Baba: “2047 నాటికి ఇస్లామిక్ దేశంగా ఇండియా”.. ఛంగూర్ బాబా కేసులో చార్జిషీట్..
- దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఛంగూర్ బాబా కేసు..
- బాబా ముసుగులో మతమార్పిడి చేస్తున్న ముఠా..
- హిందూ, సిక్కు యువతులే టార్గెట్‌గా లవ్ జిహాద్..
- 2047 నాటికి భారత్‌ని ఇస్లామిక్ దేశంగా మార్చే ప్లాన్..
- ఛార్జిషీట్ దాఖలు చేసిన యూపీ పోలీసులు, సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో బలరాంపూర్‌లో జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబా ముసుగులో హిందువును, సిక్కు మతం మార్చే పెద్ద రాకెట్ ముఠాకు ఈయన నాయకత్వం వహిస్తున్న విషయాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది. లవ్ జిహాద్ ద్వారా హిందూ, సిక్కు యువతను వలలో వేసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందడం, పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో జలాదుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా, అతడి కుమారుడు మోహబూబ్‌పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. గత మూడేళ్లుగా హిందూ బాలికను వలలో వేసుకుని మతం మార్చడానికి 1000 మందికి పైగా ముస్లిం యువకులకు నిధులు సమకూర్చినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయచి. ఈ కాలంలోనే ముస్లిం దేశాల నుంచి ఛంగూర్ బాబా రూ. 500 కోట్లు పొందినట్లు ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల్చింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Drug Case : చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
ఇవే కాకుండా మరో భయంకరమైన కుట్ర గురించి చార్జిషీట్ పేర్కొంది. 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే కుట్రతో, లవ్ జిహాద్, బెదిరింపుల ద్వారా ప్రజల్ని మతం మార్చాలని ఇతడి ముఠా చాలా కాలంగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చార్జిషీట్‌లో 29 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. వీరిలో 10 మంది ప్రత్యక్షంగా ఒత్తిడి, బలవంతం ద్వారా వేధింపులు ఎదుర్కొన్నారు. ఇందులో ఒక మహిళ మొహబూబ్, అతడి అనుచరుడు నవీన్ రోహ్రా మతమార్పిడి పేరుతో లైంగిక దోపిడీ, వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
2047 నాటికి భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని పదే పదే చెప్పేవారిన ఒక బాధితురాలు విచారణలో చెప్పింది. చీర తీసుకోవాలనే నెపంతో ఒక ప్రైవేట్ గదికి రప్పించి, ఆమెపై దాడి చేసి, మతాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు మరో మహిళ ఆరోపించింది. దర్యాప్తులో నవీన్ రోహ్రాను ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!