Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు రోజురోజుకు వెలుగులోకి వస్తు్న్నాయి. హిందూ అమ్మాయిలే లక్ష్యంగ మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చంగూర్ బాబాకు మతమార్పిడిల కోసం మిడిల్ ఈస్ట్‌లోని పలు ఇస్లాం దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా మతమార్పిడిల కోసం వందల కోట్లు సేకరించినట్లు తేలింది.
కోడ్ పదాలు ఉపయోగించి మతమార్పిడిలను ప్రోత్సహించినట్లు విచారణలో వెల్లడైంది. వివిధ దశల్లో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి పలు కోడ్ నేమ్స్ వాడినట్లు గుర్తించారు. ప్రోత్సహకాలు, ఆర్థిక సాయం, వివాహ హామీల, బలవంతంగా బెదిరించడంతో అనేక మందిని ఆకర్షించాడు. ఎక్కువగా మహిళల్ని ట్రాప్ చేశాడు.
Read Also: Kota Srinivas Death : ‘కోట’ రాజకీయాలను ఎందుకు వదిలేశాడు..?
‘‘ప్రాజెక్ట్’’ అంటే మహిళ అని, ‘‘మిట్టి పలట్నా( మట్టి మార్చడం)’’ అంటే మతమార్పిడి అని, ‘‘కాజల్ లగానా’’ అంటే మహిళల్ని మాయలోకి దించడం అని, ‘‘దర్శన్’’ అంటే సదరు అమ్మాయిని బాబాకు పరిచయం చేయడం అని తేలింది. ఈ వివరాలను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) శనివారం వెల్లడించింది. ఈ కేసులో ఎన్ఐఏ, ఈడీ కూడా విచారణ ప్రారంభించాయి. ఛంగూర్ బాబాతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ. 68 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. 3 నెలల వ్యవధిలో ఈ ఖాతాల్లోకి దాదాపుగా రూ. 7 కోట్లు జమయ్యాయి.
జూలై 5న, మత మార్పిడి ముఠాకు సూత్రధారిగా భావిస్తున్న ఛంగూర్ బాబాను, అతని సహాయకురాలు నీతు అలియాస్ నస్రీన్‌తో పాటు అరెస్టు చేశారు. 16 ఏళ్ల బాలిక తాను కూడా బాధితుల్లో ఒకరిని అని ఆరోపించింది. ప్రేమ పేరుతో తన ఇంటి సమీపంలో ఉండే అమీర్ హుస్సేన్ తనను ట్రాప్ చేసినట్లు చెప్పింది. అతడి సోదరి నేహాఖాన్ ద్వారా హుస్సేన్‌ని కలిసినట్లు వెల్లడించింది. తనను దర్గాకు తీసుకెళ్లి, ఛంగూర్ బాబాకు పరిచయం చేసినట్లు వెల్లడించింది. ఇస్లాంలోకి మారి హుస్సేన్‌ను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు చెప్పింది.