సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెన్నై,ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు చేరుకుని వివిధ అంశాలు పరిశీలిస్తున్నారు. ఆకాశమార్గంలో రెండు రూట్స్ వున్నా ఎందుకు ఇదే మార్గం బిపిన్ రావత్ బృందం ఎంచుకుందనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాపర్ లో ఎందుకు ప్రయాణం చేసారన్న కోణం లో అధికారుల ఆరా తీస్తున్నారు. సుల్లూరు క్యాంపు నుండి వెల్లింగ్టన్ క్యాంపు రోడ్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతనిపై మైసూర్ విమానాశ్రయం లో ఒక వ్యక్తి దాడికి పాల్పడగా .. విజయ్ మేనేజర్ అతడిపై దాడికి దిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయమై విజయ్ సేతుపతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అది చిన్న గొడవ అని, అతడు తాగిన మైకంలో మాట్లాడాడని, ఈ ఘటనను హైలెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ ఘటనలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సౌత్ ప్రేక్షకుల్లో అశేషమైన అభిమానం, క్రేజ్ ఉంది. అటు నార్త్ లోనూ అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్ కు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలంతా ఫిదా అవుతారు. అలా అప్పుడప్పుడూ బాలీవుడ్ లోనూ ఎంతో కొంత బన్నీ ప్రసక్తి వస్తుంది. ఇక మలయాళంలో మన హీరోకు ఉన్న క్రేజ్ వేరు. అక్కడ ఆయన ఇప్పటి వరకూ కనీసం ఒక్క సినిమాలోనూ నటించకపోయినప్పటికీ బన్నీకి మాలీవుడ్ లో…
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్…
దక్షిణ భారత సినిమా సూపర్ స్టార్ కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తనకు కోవిడ్ -19 సోకింది అంటూ గురించి ట్వీట్ చేసినప్పటి నుండి ఆయన అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని పగలు, రాత్రి ప్రార్థనలు చేస్తున్నారు. రజినీకాంత్ తో సహా పలువురు ప్రముఖులు ఆయన…
తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, రాయసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే తూత్తుకుడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక చెన్నైనగరంలో ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. Read: ఆ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా… రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా… ఇప్పటి…
వివాహం జరిగి 24 గంటలు కాకముందే ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం నాడు వరుడు మృతి చెందగా.. గురువారం నాడు వధువు ప్రాణం కోల్పోయింది. దీంతో పెళ్లి జరిగిన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లో వెళ్తే… హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళికి ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దల…
మొత్తానికి పెట్రోల్ ధరలను టమాటా దాటేసింది. ఇది సామాన్యుడి నిత్యావసరం. ఏదో ఒక రకంగా ఏ వంటకంలో అయినా టమాటా ఉండాల్సిందే. ఐతే ఇప్పుడు చాలా వాటిలో కనిపించట్లేదు. పప్పు చారు..సాంబారు మాత్రమే కాదు ఇడ్లీ చట్నీల్లో కూడా పత్తా లేదు. దేశంలో కూరగాయల ధరలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలున్న టమాటా ధర ఉన్నట్టుంది వంద దాటేసింది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో…
బంగారం రేటు పెరుగుతుండడంతో కేటుగాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. బంగారాన్ని విదేశాలనుంచి అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. వివిధ రూపాల్లో బంగారం దేశంలోకి ఎంటరవుతోంది. పేస్టు రూపంలో, బ్యాగ్ లు, సెల్ ఫోన్ బ్యాటరీలు, క్యాప్సుల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల రూపంలో .. కస్టమ్స్ కళ్ళుగప్పి మరీ తెచ్చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్.. ఎయిర్ పోర్టులు వేరైనా జరిగేది మాత్రం బంగారం స్మగ్లింగ్. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కొలంబో ప్రయాణీకుల వద్ద 86…
కరోనా కారణంగా ఇండియాలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ యూఏఈ లో ముగిసింది. కానీ ఐపీఎల్ 2022 పూర్తిగా ఇండియాలోనే జరుగుతుంది అని ఈ మధ్యే బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఐపీఎల్ 2022 పై కసరత్తు చేస్తుంది బీసీసీఐ. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ ఏప్రిల్ 2, 2022న ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. కానీ…