దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా చాలా థాంక్స్. మీరు ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా రాజమౌళికి థాంక్స్ చెప్పాలి.. ఈ పాత్రను నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు. ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టం అంతా ఇంతాకాదు.
బాహుబలి చిత్రాని కన్నా ఎక్కువ కష్టపడ్డాడు జక్కన్న.. అప్పట్లో ఇద్దరు స్టార్లు కమల్- రజినీలను కలిపి అభిమానులకు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది బాలచందర్ అయితే.. ఇప్పుడు ఆ పనిని రాజమౌళి తీసుకున్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నా.. ఇక చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తనతో నా స్నేహం ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన చరణ్ అభిమానులందరికి థాంక్స్.. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి.. చివరిగా ఒక్క మాట దయచేసి అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి” అంటూ ముగించారు.