టాలీవుడ్ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు. తనను కొందరు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని తెలిపిన వారు ఇప్పుడు మోసం చేశారని…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు చెన్నై పోలీసులకు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నైలోని విజయ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానించిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి…
చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతోంది. ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఇప్పటికీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మీనంబాకంలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, నగుబాకంలో 43 మిల్లీ…
తమిళనాడుకు ఒక వరుణగండం తీరింది.. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. లాండ్ ఫాల్ తర్వాత వాయుగుండం తీవ్ర తగ్గుతుందని వాతావరణశాఖ చెబుతోంది. అయితే, శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ఇటు తూర్పు…
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు.. కాగా,…
భారీ వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.…
తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. వరద ముంపు భయం చెన్నై వాసుల్ని వెంటాడుతూనే వుంది. పదిరోజులు తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలతో పుయల్, చంబారపాకం డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు…
దీపావళి అంటే పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది.. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు.. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ…
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న చిన్న గుంత ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను కబళించింది. ప్రతిరోజూ లాగే సోమవారం ఉదయం 32 ఏళ్ల మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆఫీసుకు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడటంతో అదుపుతప్పి బస్సు కింద మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకు రోడ్డుపై ఉన్న గుంతలో పడినప్పుడు ఎడమ వైపు…