Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- ఉద్యోగం పేరుతో చిత్రహింసలు..
- ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- కాపాడాలని వేడుకుంటూ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన హైదరాబాద్ మహిళ అక్కడ చిత్రహింసల్ని ఎదుర్కొంటోంది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పని చేయించుకుని, నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదని ఆరోపించింది. ఈ చిత్ర హింసల నుంచి తనను రక్షించాలని వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన షబ్నమ్ బేగం (26) ఈ ఏడాది మార్చి 26న స్థానిక రిక్రూట్మెంట్ ఏజెంట్ ఇంటి పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఒమాన్‌లోని మస్కట్‌కు వెళ్లింది.
అక్కడికి వెళ్లిన తర్వాత పలు ఇళ్లలో రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పనిచేయించారని, నాలుగు నెలలుగా ఎలాంటి జీతం ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. నెలన్నర పాటు తనకు మొబైల్ ఫోన్ కూడా ఇవ్వలేదని, తనను కొట్టారని, హింసించారని, సరైన ఆహారం కూడా ఇవ్వలేదని షబ్నమ్ కన్నీరు కారుస్తూ వీడియోలో వెల్లడించింది. ఈ వీడియోను హైదరాబాద్‌లోని మజ్లిచ్ బచావో తహ్రీక్ నేత అమ్జద్ ఉల్లా ఖాన్‌కు పంపింది. యజమానుల వేధింపులు భరించలేక అక్కడి నుంచి తప్పించుకుని మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాయలానికి వెళ్లినట్లు షబ్నమ్ చెప్పారు. తన పాస్‌పోర్టును రిక్రూట్మెంట్ ఏజెంట్లు తీసుకున్నారని, తనను స్వదేశానికి తీసుకురావాలని ఆమె కోరారు.
Also Read
అమ్జద్ ఉల్లా ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం.. నెలకు 200 ఒమానీ రియాల్స్ (సుమారుగా రూ. 50 వేలు) ఇస్తామనే హామీపై మహిళ ఒమాన్‌కు వెళ్లిందని, కానీ అక్కడ హామీకి విరుద్ధంగా పని చేయించి జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జోక్యం చేసుకుని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా షబ్నమ్‌ను సురక్షితంగా భారత్ తీసుకురావాలని కోరారు.
Urgent Appeal to Hon'ble Dr. @DrSJaishankar, Minister for External Affairs, Govt. of India
Mrs. Shabnam Begum, a resident of Pahadi Shareef, Hyderabad, was allegedly lured to Muscat, Oman by a local agent with the promise of a housemaid job offering 200 Omani Riyals/month. After… pic.twitter.com/UNrKXbv3QS
— Amjed Ullah Khan MBT (@amjedmbt) July 17, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు