Sons Kill Father: చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోదటూరుపేటలో వెలుగులోకి వచ్చింది. అప్పులు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడ్డారు.
SIR: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా విసిరింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ఈరోజు(డిసెంబర్ 19)న విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది, ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని డేటా పేర్కొంది. Read…
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా…
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు, అన్నాడీఎంకే బహిష్క్రత నేత సెంగోట్టయన్ టీవీకే గూటికి చేరారు.
దక్షిణాదికి మరో తుఫాన్ గండం పొంచి ఉంది. సెన్యార్ తుఫాన్ దక్షిణాది వైపు దూసుకొస్తోంది. మలక్కా జలసంధింపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం తుఫాన్ ‘సన్యార్’ బలపడిందని వాతావరణశాఖ తెలిపింది.
తమిళనాడు కేంద్రంగా హెచ్-1 బీ వీసాల అక్రమాలు జరుగుతున్నాయంటూ భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్-1 బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలతో ట్రంప్ ఇటీవల కఠిన నిర్ణయాలు తీసుకున్నారు
Karur stampede: తమిళ స్టార్ యాక్టర్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే. తొక్కసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలు కోరడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
పెంపుడు జంతువులపై తమిళనాడు రాజధాని చెన్నైలో కొత్త ఆంక్షలు జారీ అయ్యాయి. చెన్నై మహా నగరపాలక సంస్థ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క, పిల్లి పెంచడానికి లైసెన్స్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబల బలైపోతుంది. తాజాగా తమిళనాడులో మరో ఘోరం జరిగింది. బైక్ టాక్సీపై వెళ్తున్న మహిళను అమాంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బైక్ వదిలేసి పరారైపోయాడు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.సి. సబేశన్(68) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అలాగే నటుడు భూపతి(70) కూడా గురువారం కన్నుమూశారు. భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. భూపతి ఎవరో కాదు ప్రముఖ నటి, దివంగత మనోరమ కొడుకు. భూపతి తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భూపతికి ధనలక్ష్మి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. రేపు…