భార్యభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే వారి వైవాహిక జీవితం నూరేళ్లు సాగుతుంది. కానీ, ఇటీవల భార్యాభర్తల మధ్య నమ్మకం కన్నా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. భార్య తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంగా మారడంతో కన్నకూతురినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చెన్నై ప్రాంతానికి చేసిన రాధా కృష్ణన్ అనే వ్యక్తి…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల జనరల్ చెకప్ కోసం కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీ నాలుగు రోజులు అన్ని టెస్టులు చేయించుకొని తాజాగా ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఇక రజినీకాంత్ డిశ్చార్జ్ కావడంతో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రజినీ అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న…
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం వల్లే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి ఆస్పత్రి శుక్రవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను…
సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్…
జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత మొదటిసారి మత్స్య శాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మత్స్య శాఖకు రూ.20వేల కోట్ల నిధులు కేటాయించారు. తమిళనాడులో సీ విడ్ పార్క్ ఏర్పాటుతో వేలాది మంది మహిళలకు ఉపాధి దొరకడంతో పాటు ఆర్థిక చేయూత నిస్తుందన్నారు. విదేశాల్లో భారతదేశ…
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. చిట్యాల పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాగా టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.4 కోట్ల నగదు పట్టుబడింది. దీంతో…
చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. విదేశాలకు వెళుతున్న పార్శిల్ లో భారీగా డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల తో పాటు గాంజా గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. చెన్నై నుండి అమెరికా, కెనడా వెళుతున్న 8 పార్శిల్ లో 7990 ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్లు, 1225 గ్రాముల గంజాయి ప్యాకెట్ల ఆధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా అక్రమ మార్గాల ద్వారా ఇండియా నుండి విదేశాలకు డ్రగ్స్…
దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో నగరీకరణ పెరుగుతున్నది. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. ఇక అంబులెన్స్ వంటి వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగిరిపోయే కార్లు వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాంటి ఎగిరే కార్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆసియాలోనే మొదటి ఎగిరే కారు ఇండియాలోనే తయారు కాబోతున్నది. ఇండియన్ స్టార్టప్ సంస్థ వినతా ఏరోమొబిలిటీ ఆఫ్ ఇండియా…
తమిళనాడు సీఎం స్టాలిన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన చిరు కాసేపు స్టాలిన్ తో ముచ్చటించారు. ఆ సమయంలోనే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ…
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యపరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇవాళ అత్యవసర వైద్య చికిత్సల కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు విజయ్‌కాంత్.. కుమారుడుతో కలసి చికిత్స కోసం చెన్నై ఎయిర్‌పోర్టు నుండి దుబాయ్ ప్రయాణం అయ్యారని చెబుతున్నారు.. ఇక, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడ నుండి అమెరికాకు కూడా తీసుకెళ్తారని సమాచారం.. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్‌కాంత్.. గత ఏడాది…