లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.
ఇక ఈ చిత్రంలో నయన్ ఒక స్పెషల్ పాత్రలో నటించింది. ఇక తాజాగా ఈ సినిమాను నయన్, విగ్నేష్ తో కలిసి వీక్షించింది. నేడు చెన్నెలోని ఎస్కేప్ మాల్ లో నయన్, విగ్నేష్ కలిసి రాకీ చిత్రాన్ని వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో నయన్ లోక్ లేడీ బాస్ ని తలపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం నయన్, ప్రియుడు విగ్నేష్ దర్శకత్వంలోనే ‘కాతు వాకులా రెండు కాదల్’ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.