చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ లో చరణ్ సీన్స్ చూసి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అనుకొనేలోపు తారక్ ఎలివేషన్స్.. ఒక్క ట్రైలర్ లో ఎవరిని చూడాలో అర్ధం కాలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా సాగుతున్న కార్తికేయన్ స్పీచ్ మధ్యలో అభిమానులు జై బాలయ్య అంటూ అరవడం మొదలుపెట్టారు.. దానికి కార్తికేయన్ ఓకే గుడ్ అంటూ చెప్పాడు. దీంతో ఆ వేడుకలో కొద్దిసేపు నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్లేస్ ఏదైనా, వేడుక ఏదైనా బాలయ్య ఉండాల్సిందే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.