IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
- భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో వన్డే
- మీడియా సమావేశంలో రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న
- తెలివిగా తప్పించుకున్న హ్యారీ బ్రూక్
- ఇంగ్లండ్‌కు జో రూట్ పెద్ద బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Reacts to questions on Rohit Sharma Future: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయించనుంది. మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్నించగా.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తెలివిగా స్పందించాడు. ఇంగ్లండ్ పర్యటన రోహిత్, కోహ్లీలకు చివరిదని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘రోహిత్ గురించి ఏమి చెప్పారో నాకు తెలియదు. రోహిత్, విరాట్ ఇద్దరూ ఎన్నో సంవత్సరాలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నారు. వారు ఇప్పటికీ ఆటలో కొనసాగుతుండటం చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పి ఆ అంశాన్ని అక్కడితో ముగించాడు.
అనంతరం ఇంగ్లండ్ విజయాల్లో జో రూట్ పాత్ర గురించి బ్రూక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వన్డే క్రికెట్లో తమ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉందని అంగీకరించాడు. ‘జో రూట్ దాదాపు 200 వన్డేలు ఆడినా ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అతడు ఇంగ్లండ్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్. అతని నుంచి మేం కూడా చాలా నేర్చుకుంటున్నాం’ అని బ్రూక్ పేర్కొన్నాడు. ఇటీవల మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 111, 76, 99 స్కోర్లతో రూట్ అజేయంగా నిలవడం విశేషం.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
జో రూట్ కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్ రూట్‌పై ఎక్కువగా ఆధారపడుతోందా? అనే ప్రశ్నకు బ్రూక్ సమాధానమిచ్చాడు. ‘అవును.. ఇటీవల వన్డేలు, టెస్టుల్లో మేము రూట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. అతడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడుతుంటే.. బ్యాటింగ్ ఇంత సులభంగా ఉంటుందా అని అనిపిస్తుంది. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్ట్రైక్ రొటేటర్లలో రూట్ ఒకడు. మా జట్టులోని ప్రతి బ్యాటర్ అతడి ఆట నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి’ అని చెప్పాడు. మరోవైపు కొత్త ఓపెనర్ జేకబ్ బెతెల్ పేలవ ఫామ్‌లో ఉన్నప్పటికీ బ్రూక్ పూర్తి మద్దతు తెలిపాడు. ‘కేవలం రెండు ఇన్నింగ్స్‌ల ఆధారంగా ఒక ఆటగాడిని అంచనా వేయలేం. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. త్వరలోనే పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని నమ్ముతున్నాను’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!