స్కూళ్ల సమయాన్ని పొడిగించొద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఇళ్లలోనే చూడాలని చెప్పింది. ఎవరైనా చూడలేకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది.
జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 లైవ్ చూడటానికి పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. చంద్రయాన్ విజయవంతమైతే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
New Pics Of Moon By Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ జాబిల్లి పైకి చేరుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. చంద్రయాన్ 3 ని జాబిల్లి గురించి లోతుగా పరిశోధించడానికి ఇస్రో రూపొందించింది. ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేదు. చంద్రయాన్ 3 కనుక చంద్రుని మీద సాఫ్ట్…
ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'చంద్రయాన్-3' ద్వారా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ లైవ్ ను చూసేందుకు పాఠశాలలు సాయంత్రం ఒక గంట పాటు ప్రత్యేకంగా తెరిచి ఉంచాలన్నారు.
Chandrayaan 2 mission Mistakes: చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరి ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలవాలన్న భారత్ కల నెరవేరడానికి ఇంకా కొద్దిగంటలు మాత్రమే సమయం ఉంది. అయితే దీనిని సాధించడం కోసం సెప్టెంబర్ 7, 2019న, చంద్రయాన్ 2 మిషన్‌ను ఇస్రో ప్రారంభించింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్ రోవర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత అంతరిక్ష కేంద్రం ఎలాంటి సమాచారాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైంది. అసలు ప్రయోగం విఫలం…
Reasons Behind Luna-25 Crash: చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలని భారత్ భావిస్తున్న తరుణంలో రష్యా దానికి బ్రేక్ వేయాలని చూసింది. హడావుడిగా లూనా-25ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. 47 సంవత్సరాల తరువాత జాబిల్లిపై ప్రయోగం చేయడానికి రష్యా పూనుకుంది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాని కంటే ముందు తమ లూనా 25…
Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్…
ఇస్రో శాస్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కానుంది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకప్రకటన చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కాకపోయినప్పటికీ ఆ ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతోందని.. ఆ ఆర్బిటర్‌ను చంద్రయాన్ 3…