Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ అన్నా.. బయోపిక్ అన్నా బాలీవుడ్ లో మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్. దేశంలో ఎలాంటి మూమెంట్ జరిగినా..దేశాన్ని మొత్తం గడగడలాడించే ఘటన జరిగినా దానిపై బయోపిక్ తీయడం మేకర్స్ కు అలవాటే.
చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి అందులోకి దిగితే ప్రకాష్ రాజ్ కనిపించడు.. ఆ పాత్రనే కనిపిస్తుంది. అలాంటి విలక్షణ నటుడును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. విమర్శిస్తున్నారు.. అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
చంద్రుడిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారతదేశం చేసిన అద్భుతమైన ఫీట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అభినందించారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్-3 విజయంతో తన జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండమ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించని మేరకే ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిసింది.