సీఎం జగన్‌కు వైద్య పరీక్షలు.. కాలి మడమకు ఎంఆర్‌ఐ స్కాన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత కొద్ది రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న సీఎం జగన్ సోమవారం విజయవాడలో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్‌లో వైద్య పరీక్షలను చేయించుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం లోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు మధ్యాహ్నం వైయస్ జగన్ వచ్చారు. డయాగ్నస్టిక్ సెంటర్‌లో ముఖ్యమంత్రికి ఎంఆర్ఐ స్కాన్ తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలు చేసినట్లు సమాచారం. పరీక్షల కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు డయాగ్నోస్టిక్ సెంటర్‌లోనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డయాగ్నస్టిక్‌కు చేరుకున్న సీఎం తిరిగి మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి భారతీ రెడ్డి కూడా ఉన్నారు.
బైక్ ఢీ కొనడంతో పూర్తిగా దగ్ధమైన బస్సు.. ఓ వ్యక్తి మృతి!
శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఢీ కొట్టడంతో ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ కుమార్ (26) యూజే ఫార్ములా కంపెనీలో పని చేస్తున్నాడు. విధుల నిమిత్తం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తన బైక్‌పై బయలుదేరాడు. కొల్తూరు వద్ద ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును అతడు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సీపీఎం, సీపీఐ రాష్ట్రకమిటీల వేర్వేరు సమావేశాలు
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల బీఆర్‌ఎస్ తరుఫున బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. అయితే.. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు. కానీ.. నిన్న ఎవ్వరితోనూ పొత్తుపెట్టోమని స్పష్టం చేయడంతో.. వామపక్షాల దైలమాలో పడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు రెండు వామపక్షాలు మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. వారు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఉంది. కేసీఆర్ తమ పట్ల వ్యవహరించిన తీరుపై వారు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారని, ఆయన కంచెను చక్కదిద్దుకున్న బీజేపీతో విరోధం పెట్టుకోకుండా ఉండేందుకు ఇలా చేశారంటూ వామపక్ష నేతలు అంటున్నారు.
చనిపోయిన నాలుగేళ్ల తర్వాత వచ్చిన తీర్పు.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక పర్యటనలో ప్రమాదంలో భార్య, కొడుకు మరియు మామలను కోల్పోయిన ఢిల్లీ వ్యక్తికి రూ.50 లక్షలు చెల్లించాలని ప్రీమియర్ ట్రావెల్ ఏజెన్సీలు థామస్ కుక్ మరియు రెడ్ యాపిల్ ట్రావెల్‌లను ఆదేశించింది. డిసెంబర్ 2019 ప్రమాదంలో మరణించిన కనుపురియా సైగల్ మాజీ జర్నలిస్ట్ మరియు NDTVలో న్యూస్ యాంకర్. ఆమె కుమారుడు శ్రేయా సైగల్ మరియు తండ్రి, ప్రముఖ హిందీ సాహిత్యవేత్త గంగా ప్రసాద్ విమల్, వారు ప్రయాణిస్తున్న వ్యాన్ కొలంబోలో కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆమెతో పాటు మరణించారు. ఈ ప్రమాదంలో వ్యాను నడుపుతున్న 52 ఏళ్ల డ్రైవర్ కూడా మృతి చెందాడు..
ఆమె భర్త యోగేష్ సైగల్, వారి కుమార్తె ఐశ్వర్య సైగల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి..దాదాపు నాలుగేళ్ల తర్వాత, వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక యోగేష్ సైగల్‌కు పరిహారం చెల్లించాలని ట్రావెల్ ఏజెన్సీలను ఆదేశించింది.ప్రతిపక్ష పార్టీల వారిచే నియమించబడిన డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యం/లోపం ఉంది.. అది కేవలం బుకింగ్ అని పేర్కొనడం ద్వారా సంబంధిత బాధ్యత నుండి తప్పించుకోవడానికి అనుమతించబడదు. ఫిర్యాదుదారు యొక్క ఆదేశానుసారం స్థలాలు మొదలైనవి అని ఫోరమ్ తన ఆర్డర్‌లో పేర్కొంది..
తన వారసుడిని నిలబెట్టేందుకు కష్టపడుతున్న స్టార్ ప్రొడ్యూసర్
దిల్ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ అయినవే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు. దిల్ రాజు బ్యానర్లో పరిచయమైన వారు ఎంతో మంది హీరోలుగా, దర్శకులుగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. దిల్ రాజుకి ప్రస్తుతానికి వారసులు లేకపోవడంతో ఈయన ఫ్యామిలీ నుంచి హీరోలు ఎవరు రాలేదు. దీంతో దిల్ రాజుకి వారసుడుగా తన మేనల్లుడైన ఆశిష్ ను రౌడీ బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇప్పించాడు.
ఎంతో మంది వారసులకు తొలి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజ్ తన ఫ్యామిలీ హీరోకు మాత్రం ‘రౌడీ బాయ్స్’ తో సక్సెస్ అందించలేకపోయాడు. భారీ ప్రమోషన్స్, బడ్జెట్‌తో తెరకెక్కించినా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. ప్రస్తుతం ఆశిష్ ‘సెల్ఫిష్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ సెట్స్‌పై ఉండగానే ఆశిష్‌కి 3వ సినిమాను సెట్ చేశాడు. సోమవారం పూజా కార్యక్రమంతో ఆశిష్ థర్డ్ మూవీ మొదలైంది. హారర్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాతో అరుణ్ డైరెక్టర్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా ఆటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
పంచభూతాలు కూడా మెగాస్టార్ కోసం కదిలోస్తాయి… వేయండ్రా విజిల్స్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అభిమానులు అనుకున్న సందర్భం గత అయిదారు ఏళ్లలో అయితే జరగలేదు. ఈ మ్యాటర్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఒక జగదేక వీరుడు రేంజ్ ఫాంటసీ డ్రామా చేస్తే ఎలా ఉంటుంది… థియేటర్స్ పూనకాలతో ఊగిపోతాయి కదా. అలాంటి అనౌన్స్మెంట్ నే ఇచ్చిన యువీ క్రియేషన్స్. నందమూరి కళ్యాణ్ రామ్ కి బింబిసారా లాంటి హిట్ ఇచ్చాడు కొత్త దర్శకుడు వశిష్ఠ. మొదటి సినిమాతోనే సెమీ పీరియాడిక్ సోషియో ఫాంటసీ డ్రామా సినిమా చేయడం రిస్క్ అంటే ఆ రిస్క్ తోనే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వశిష్ట.
ఎలోన్ మస్క్ దెబ్బకి.. బిచ్చగాళ్లుగా మారిన బిట్ కాయిన్ ఇన్వెస్టర్లు
ఎలాన్ మస్క్ నిర్ణయాలు, ప్రకటనలు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తాయి. అటువంటి తుఫాను ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ మార్కెట్లో పుట్టింది. ఎలోన్ మస్క్ ఒక వారం క్రితం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులను దివాలా అంచుకు తీసుకువచ్చింది. అవును, ఇప్పటికే బిట్‌కాయిన్‌లో నష్టాలను ఎదుర్కొంటున్న పెట్టుబడిదారులు గత వారం నుండి భారీ నష్టాలను చవిచూశారు. సుమారు 7 రోజుల్లో బిట్‌కాయిన్ ధర 7 శాతానికి పైగా క్షీణించింది. మరోవైపు, ప్రపంచంలోని మిగిలిన క్రిప్టోకరెన్సీలు చాలా నష్టపోయాయి. ప్రపంచంలోని ప్రధాన క్రిప్టోకరెన్సీలకు ఎంత నష్టం జరిగిందో తెలుసుకుందాం..
గత వారంలో బిట్‌కాయిన్ ధర 11 శాతానికి పైగా క్షీణించింది. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర 26041 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. FTX క్రాష్ అయిన నవంబర్ 2022 తర్వాత ఈ క్షీణత వారంవారీ అతిపెద్ద క్షీణతగా Coinmarket.com నుండి వచ్చిన డేటా ద్వారా తెలుస్తోంది. ఒక గంట 24 గంటల ట్రేడింగ్ సెషన్‌ను పరిశీలిస్తే, బిట్‌కాయిన్ ధరలు ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లు ఆ కాయిన్ నుండి 50 శాతం కంటే ఎక్కువ ప్రయోజనం పొందారు.
వెల్ కమ్ బడ్డీ… చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో లింక్ అయిన విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్
ఇస్రో శాస్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కానుంది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకప్రకటన చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కాకపోయినప్పటికీ ఆ ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతోందని.. ఆ ఆర్బిటర్‌ను చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్‌కు విజయవంతంగా లింక్ చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని పైకి పంపించిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. 8 సాంకేతిక పరికరాలను కలిగి ఉన్న ఈ ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఆ ఆర్బిటర్‌లో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందని అంటే అది అంతకాలం పాటు చంద్రని చుట్టూ తిరుగతుందని ఇస్రో అప్పట్లోనే తెలిపింది. ఈ కారణంగానే చంద్రయాన్ 3 లో ఆర్బిటర్‌ను ఇస్రో పంపలేదు. అందువల్లే చంద్రయాన్ 3 ప్రయోగంలో ఆర్బిటల్ లేదు. దీనికి సంబంధించి ట్వీట్ చేసిన ఇస్రో చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ను స్వాగతించిందని పేర్కొంది. వీటి మధ్య డేటా ట్రాన్స్ ఫర్ సిస్టమ్ ఏర్పాటు అయినట్లు వెల్లడించింది. ఇదిలా వుండగా చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో పేర్కొంది. మరొక విషయాన్నా కూడా ఇస్రో తెలిపింది. ల్యాండర్ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.
తిరుమల ఘాట్ రోడ్‌లో యాక్సిడెంట్… ఐదుగురు భక్తులకు గాయాలు
తిరుమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు గాయపడ్డారు. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఐదుగురు భక్తులు గాయపడ్డారు. మంగళవారం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. తిరుమల ఏడుకొండలపైకి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై టెంపో వాహనం అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు టెంపో వాహనంలో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా 13వ మలుపు వద్ద టెంపో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగింది. దీంతో వాహనంలోని ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే టీటీడీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రమాదానికి గురయిన టెంపోను అక్కడినుండి వెంటనే తరలించారు.
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల పాటు జీతంతో కూడిన సెలవు
ఆల్ ఇండియా సర్వీస్ (ఏఐఎస్)లో అర్హులైన సభ్యులకు సెలవులకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం ఇప్పుడు ఈ ఉద్యోగులు వారి కెరీర్ మొత్తంలో రెండు సంవత్సరాల వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం గరిష్టంగా రెండేళ్ల వరకు ఈ సెలవును ఇస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ జూలై 28న విడుదలైంది. దీని కింద ఆల్ ఇండియా సర్వీస్ చిల్డ్రన్ లీవ్ రూల్ 1995ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సవరించింది. ఏఐఎస్ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం వేతనాలు అందుతాయి.