చంద్రయాన్-3 మిషన్ కీలకమైన మరో ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా కాంప్లీట్ చేసింది. మరోమారు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కిలో మీటర్ల బై 1437 కిలో మీటర్లకు తగ్గించినట్టు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ పుల్ గా దూసుకుపోతుంది. అయితే, ఆదివారం చంద్రయాన్-3.. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను వీడియో తీసింది. దీంతో ఆ వీడియోను ఇస్రో ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. శనివారమే చంద్రుని లూనార్ కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ ఆదివారం వీడియో చిత్రీకరించగా అందులో చంద్రుని ఉపరితలం మొత్తం.. నీలి ఆకుపచ్చ రంగులో కనిపించినట్లు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో కాసేపట్లో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది.
చంద్రయాన్-3 కు సంబంధించి మరొక వైరల్ న్యూస్ బయటికొచ్చింది. పాకిస్తాన్ మాజీ మంత్రికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రయాన్-3 గురించి మాట్లాడి కడుపుబ్బా నవ్విస్తాడు.
Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత జూలై 14వ తేదీ చరిత్రలో బంగారు పుటల్లో నిలిచిపోయింది. దేశం మొత్తం ఇప్పుడు చంద్రునిపై చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం వేచి ఉంది.
చంద్రుడిపై రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతమైంది. విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన ప్రయాణంలో కీలక దిశగా సాగుతోంది.