Chandrayaan 2 mission Mistakes: చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరి ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలవాలన్న భారత్ కల నెరవేరడానికి ఇంకా కొద్దిగంటలు మాత్రమే సమయం ఉంది. అయితే దీనిని సాధించడం కోసం సెప్టెంబర్ 7, 2019న, చంద్రయాన్ 2 మిషన్‌ను ఇస్రో ప్రారంభించింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్ రోవర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత అంతరిక్ష కేంద్రం ఎలాంటి సమాచారాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైంది. అసలు ప్రయోగం విఫలం కావడానికి కారణం సాఫ్ట్ వేర్ లో తలెత్తిన లోపం. దీని కారణంగా ల్యాండింగ్ ఉపరితలం నుండి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రోకు ఎలాంటి సమాచారం అందలేదు. చంద్రునిపై ల్యాండ్ అవడానికి ముందు విక్రమ్ ల్యాండర్ వేగాన్ని ఇస్రో అదుుపు చేయాల్సి ఉంటుంది. నాలుగు దశలో విక్రమ్ ల్యాండర్ వేగాన్ని 6000 Kmph నుంచి 0 Kmphకు తగ్గించాలి. అయితే ల్యాండర్ తో సంబంధాలు తెగిపోవడంతో ఇస్రో చంద్రయాన్ 2 విషయంలో దానిని చేయలేకపోయింది. విక్రమ్ రోవర్ ప్లాన్ ప్రకాం 55 డిగ్రీలుగా ఉండాల్సిన దాని ట్రాజెక్టరీని 410 డిగ్రీలకు మార్చకుంది. దీంతో ఇస్రోతో దాని సంబంధాలు తెగిపోయి ఎలాంటి సమాచారం అందలేదు. దాంతో వారు దాని వేగాన్ని నియంత్రించలేకపోయారు.
Also Read: Luna 25: లూనా 25 క్రాష్.. భారత్ కన్నా ముందు సాధించాలన్నా ఆత్రమే కొంపముంచిందా?
చంద్రయాన్ 2 కు చంద్రయాన్ 3 కి మధ్య ఉన్న తేడాలు ఇవే
చంద్రయాన్ 2 లో లాగా చంద్రయాన్ 3 లో ఆర్బిటర్ లేదు. ఎందుకంటే చంద్రయాన్ 2 మిషన్ విఫలమయినప్పటికీ దాని ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. అందుకే చంద్రయాన్ 3 ను ఆర్బిటర్ లేకుండానే ప్రయోగించారు. ఇక 7 సంవత్సరాల పాటు ఆర్బిటర్ తిరగడానికి సరిపోయే ఇంధనం అందులో ఉంది. ఇక తాజాగా చంద్రయాన్ 3 చంద్రయాన్ 2 ఆర్బిటర్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రయాన్ 2 మిషన్‌లో లేని స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) అనే పేలోడ్‌ను మోస్తుంది.SHAPE చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేస్తుంది. కాబట్టి చంద్రయాన్ 3 ISROతో సంబంధాన్ని కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చంద్రయాన్ 2 లాగా కాకుండా చంద్రయాన్ 3 సరిగ్గా దాని ట్రాజెక్టరీని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రయాన్ 3 చంద్రయాన్ 2 లాగా విఫలమయ్యే అవకాశం లేదు. మరికొద్ది గంటల్లోనే చంద్రయాన్ 3 జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్రకెక్కనుంది.