Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని సీనియర్ శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఒకవేళ రేపు కనుక చంద్రయాన్ 3 ల్యాండింగ్ జరగకపోతే ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ఇక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి రెండు గంటల ముందే ఓసారి మొత్తం అన్ని విషయాలను పరిశీలిస్తామని అప్పటి ల్యాండర్ పరిస్థితులు, చంద్రుడిపై పరిస్థితులు బేరీజు వేసుకొని చంద్రయాన్ 3 జాబిల్లిపైకి దిగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని ఇస్రో తెలిపింది.
Also Read:Chandrayaan3: వెల్ కమ్ బడ్డీ… చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో లింక్ అయిన విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్
అయితే తాజాగా చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ లింక్ అయిన సంగతి తెలిసిందే. ఇక చంద్రుడిపైకి దిగేందుకు వేచి చూస్తున్న విక్రమ్ ల్యాండర్ దానికి అనువైన పరిస్థితుల కోసం వెయిట్ చేస్తోంది. ల్యాండింగ్ సమయంలో సమస్యలు వస్తే ఆగస్టు 27వతేదీన చంద్రునిపై మాడ్యూల్ ల్యాండ్ చేస్తామని ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. అయినా ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే విక్రమ్ ల్యాండర్ ఇస్రో పై ల్యాండ్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చంద్రయాన్ 3 అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ల్యాండ్ కావాలి. ఇలా కనుక జరిగే అంతరిక్ష ప్రయోగాలలో భారత్ ఎలైట్ జాబితాలోకి చేరనుంది. చంద్రునిపై సాఫ్ట్-ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా కీర్తి ఘడించనుంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా దేశాల తరువాత ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలవనుంది. అయితే ప్రస్తుతం ఇస్రో చేసిన ప్రకటనతో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎప్పుడు జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రేపే ల్యాండింగ్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు.