చంద్రయాన్ -3 పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కార్టూన్ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రుడి నుంచి వస్తున్న తొలి చిత్రం’ అంటూ ఓ పోస్టు చేశారు ప్రకాష్ రాజ్. ఆ కార్టూన్ లో లుంగీ కట్టుకొని, పొడవాటి చేతులు ఉన్న షర్ట్ ధరించి, టీ పోస్తున్నట్లు ఉన్న ఫొటోను ఆదివారం షేర్ చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-3లో కీలకఘట్టం పూర్తి అయినట్లు ప్రకటించింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన చంద్రయాన్-3 ఇప్పుడు చంద్రుడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదివారం చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ రెండవ చివరి డి-బూస్టింగ్ ఆపరేషన్ విజయవంతమైంది.
మరోవైపు చంద్రయాన్-3 ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ల్యాండర్ ఇమేజర్ (LI) కెమెరా-1 ద్వారా తీసిన అద్భుతమైన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో X లో షేర్ చేసింది. అయితే గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోగానే ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది.
భారతదేశం తన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్‌తో ఈరోజు చంద్రునిపై కలలకు దగ్గరగా చేరుకుంది. వచ్చే బుధవారం చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్‌కు ముందు కీలకమైన విన్యాసాన్ని ప్రదర్శించింది. చంద్రయాన్ మిషన్ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం పురోగమిస్తోంది. గురువారం చంద్రయాన్-3 మిషన్ నుంచి ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా వేరు చేయబడిన సంగతి తెలిసిందే.
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేసింది. అంటే ల్యాండర్ ఒంటరిగా చంద్రుడి వైపు ముందుకు సాగుతోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. Chandrayaan 3, breaking news, latest news, telugu news, vikram lander