పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఈ నెల 9 ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కంటే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయన్నారు. నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.