చంద్రబాబు టీడీపీ కేడర్‌ను మోసం చేస్తున్నారు : వల్లభనేని వంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు కేంద్రం పేరెత్తాలంటే వెన్నులో వణుకు. గడచిన ఎన్నికల్లో మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన పేరెత్తే సాహసం చేయడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక తన ఎంపీలను బీజేపీకి పంపారు చంద్రబాబు.
ఇక తమది జాతీయ పార్టీలు.. అంతర్జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తెలంగాణలో ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం లేదు. తడవకొకరును తెర మీదకు తెచ్చి ఏదో డ్రామాలాడుతున్నారు. ఓసారి నిమ్మగడ్డను తెస్తారు.. మరోసారి ఇంకో గడ్డను తెస్తారు. ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వం కేవలం రూపాయి మాత్రమే రోడ్ సెస్ పేరుతో వసూలు చేస్తోంది. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అల్జీమర్సే కాదు.. పిచ్చిపట్టిందనే నిర్ణయానికి ప్రజలు వస్తారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా చంద్రబాబు టెంట్ మూసేస్తారు.. షెడ్ తీసేస్తారు. చంద్రబాబు చెప్పాడని పెట్రోల్ బంకుల ముందు హరన్ కొట్టడం ఏంటీ. కరెంట్ ఛార్జీలు పెరిగాయని కరెంట్ తీగలు.. ట్రాన్సఫార్మర్లు పట్టుకోమంటే పట్టుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజల నుంచి వసూల్ చేసిన సెస్‌ను పోలవరంలో పులిహోరకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు తెలుగుదేశం కేడర్‌ను మోసం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!