టీడీపీ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతోందని ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. దొంగ ఓటర్లను తరలిస్తున్నారని ఫిర్యాదు చేసారు. స్థానిక ఎన్నికల్లో టిడిపి అక్రమాలకు పాల్పడుతోంది. చంద్రబాబు పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. ఉనికి కోసం నానా రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటుకు ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. ఏ…
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టీడీపీ నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. రైతుల పాదయాత్రను తమకు అనుకూలంగా మార్చుకుని పసుపుమయంగా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదని.. కేవలం టీడీపీ శ్రేణులను మాత్రమే అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. Read Also: శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్…
ఏపీలో రాజకీయం వేడిమీద వుంది. ఒక వైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు అమరావతి పాదయాత్రలతో మరింతగా హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏపీ మంత్రి జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ భూస్థాపితం అవుతుందని, అమరావతి రైతుల మహాపాదయాత్ర కు దర్శకుడు, నిర్మాత చంద్రబాబే అన్నారు. ఈ పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం కాదు. మోసం టు మోసం టైటిల్ పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర కు ఆదరణ లేదని రైతు…
కుప్పం మున్సిపాలిటీ పోరు సెగలు రేపుతోంది. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు కొత్త అస్త్రం ప్రయోగించి చర్చకు దారితీశారు. కుప్పంలోనే టీడీపీ సీనియర్లు..! చిత్తూరు జిల్లాలోని కుప్పం.. కావటానికి మున్సిపాలిటీనే ..! ఇక్కడ పురపోరు మాత్రం హై ఓల్టేజ్ తో సాగుతోంది. గెలుపు కోసం వైసీపీ, టీడీపీ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు.…
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ దుర్మార్గంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఏకగ్రీవాలు పెరిగాయని, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా…
చంద్రబాబు, నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని.. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు.. సీఎంను దున్నపోతు అంటూ లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి ఇంటిని తాకుతా అంటున్నాడు.. రా.. నా కొడకా… ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు… చూస్తా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక, లోకేష్, చంద్రబాబు తోలు ఒలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టిస్తా అంటూ సంచలన…
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు…