పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న టీడీపీ అధినేత సూచించారు. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్న టీడీపీ అధినేత… వైసీపీ…
Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో…
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు.
Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నేనే సెన్షన్.. ఆర్డర్ తెచ్చానని రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. నా తరువాత వచ్చిన మాజీ ఎంపి మార్గా భరత్ రామ్ శిలాఫలకం వేసి నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు.
CM Chandrababu: వివిధ శాఖలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సమీక్షించనున్నారు. అలాగే, ఆర్థిక శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాధ రథయాత్ర నిర్వహణలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం…
CM Chandrababu: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా చాలా అభివృద్ధి చేస్తున్నారని..అందుకే స్వయంగా వచ్చి కలిశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనేక సంక్షేభాలు ఎదురుకుంది తెలుగు దేశం పార్టీ అని తెలిపారు. నన్ను ఎందుకు జైలుకు పంపారో తెలియదన్నారు. కానీ తెలంగాణలో మీరు నాకోసం చేసిన నిరసనలు మర్చిపోలేనిదన్నారు. రాజకీయం అంటే సొంత వ్యాపారం చేసుకోవడం కాదని తెలిపారు. తెలుగు దేశం ముందు.. తెలుగు తరువాత చరిత్రకు చాలా తేడా ఉందన్నారు. హైదరాబాద్ లో హై…
AP CM Chandrababu: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.