గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మాది మాటల ప్రభుత్వం కాదు……
Margani Bharat Ram: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం అని ఆయన మండిపడ్డారు.
Actor Suman: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది.. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించబోతున్నారు అని పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు.
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
జగదాంబ జ్యువెలర్స్లో యజమానిపై కత్తితో దాడి కొంపల్లిలో గురువారం తెల్లవారుజామున బుర్ఖా ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ రోడ్డులో ఉన్న దుకాణంలోకి కస్టమర్లంటూ పోజులిచ్చుకున్నారు. దొంగల్లో ఒకరు కత్తితో కొరడాతో కొట్టి, నగల పెట్టెలను బ్యాగ్లో ఉంచమని దుకాణదారుని బెదిరించారు. అయితే, నిందితులు ఆభరణాలపై చేయి వేయకముందే, దుకాణం యజమాని టేబుల్ మీద నుండి దూకి సహాయం కోసం కేకలు వేస్తూ దుకాణం నుండి…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి.