CM Chandrababu: వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. వికసిత్ భారత్ తరహాలో భాగస్వామ్యమయ్యేలా 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా విజన్ డాక్యుమెంటుపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మనుతో మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆమోగ్ సీఈఓకు చంద్రబాబు సూచనలు చేశారు. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యంతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశంలో ఏపీ విజన్ డాక్యుమెంటుపై ప్రస్తావించారు. పేదరికం లేని సమాజం, జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: CM Secretary: సీఎం చంద్రబాబు సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..” అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును అనుసంధానం చేస్తాం. ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి నుంచి కుటుంబ స్థాయి వరకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తాం. 15 శాతం గ్రోత్ రేట్ సాధించడమే ఏపీ లక్ష్యం.అనుకున్న విధంగా గ్రోత్ రేట్ సాధిస్తే తలసరి ఆదాయం పెరుగుతుంది.. పేదల జీవనం మెరుగవుతుంది. పేదరిక నిర్మూలనకు దిశగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నాం. సంపద సృష్టి పాలసీలతో 2047 విజన్ డాక్యుమెంట్ ఉండాలి.” అని ఆయన చెప్పారు.