Anagani Satya Prasad: గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళినా.. గవర్నర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోరు.. వినుకొండ పర్యటన, గవర్నర్ ని కలవడం రాజకీయ లబ్ధి కోసమే చేశారు.. జగన్ ఎన్ని నాటకాలు ఆడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని మండిపడ్డారు. వినుకొండలో హత్య ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు తప్పా.. రాజకీయ అంశాలు లేవు.. గతంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణాన్ని తిరిగి పున: ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు బాగుపడటం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగలేదు అని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ!
కాగా, గతంలో జగన్ అరాచక పాలన చూశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మాచర్లలో తోట చంద్రయ్యను టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని దారుణంగా చంపారు.. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుని అసెంబ్లీలో ఎంత హేళనగా మాట్లాడారో అందరూ చూశారు.. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారి నాయకులను కంట్రోల్ లో పెట్టి ఉంటే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కాదు కదా అని మంత్రి అన్నారు.
Read Also: Bangladesh : పోలీసులు కర్ఫ్యూను పొడగింపు.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్.. 114మంది మృతి
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకు రావడానికి జరుగుతున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా అనేక కబ్జాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు.. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాము.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసుకొని వచ్చి కబ్జాలు చేసిన వారికి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాము.. గుజరాత్ ప్రభుత్వ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేస్తాం.. రాష్ట్రంలో కబ్జాలు లేకుండా చూస్తామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు.