Minister Nimmala Ramanaidu: 2014 నుంచి 2019 వరకు పోలవరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు 34 సార్లు పర్యటించారు అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తన హయాంలో 72 శాతం పోలవరాన్ని పూర్తి చేశారు.. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి రివర్స్ టెందరింగ్ పేరుతో పోలవరాన్ని గోదాట్లో ముంచింది అని ఆరోపించారు. రివర్స్ ట్రెండింగ్ వల్ల 3500 కోట్ల రూపాయల అదనపు భారం పడింది అని విమర్శించారు. ఏజెన్సీలను మార్చొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నా.. అప్పటి ప్రభుత్వం పెడ చెవిన పెట్టి రివర్ టెండరింగ్ కి వెళ్ళింది.. ఫలితంగానే పోలవరం నిర్మాణం ప్రమాదంలో పడింది అని మంత్రి రామానాయుడు తెలిపారు.
Read Also: Rahul Gandhi : పార్లమెంట్‌లో రైతులతో రాహుల్ గాంధీ భేటీపై వివాదం
ఇక, నిర్మాణ ఏజెన్సీల పర్యవేక్షణ లేకపోవడంతో 2020లో వచ్చిన వరదలు పోలవరాన్ని ముంచేశాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2019- 24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో కేవలం రెండు శాతం మాత్రమే పోలవరం పనులు జరిగాయి.. టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తే.. వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టును విధ్వంసం చేసింది.. జలకళతో కళకళలాడే పులిచింతలలో నేడు అర టీఎంసీ కూడా నీరు లేని పరిస్థితికి వెళ్ళింది.. గుండ్లకమ్మ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో గత ప్రభుత్వం పని చేసింది.. నీటిపారుదల శాఖలో18 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి.. అవి చెల్లిస్తే తప్ప కొత్త పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రారు అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.