Miss Universe India: మిస్ యూనివర్స్- ఇండియాకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరపున అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఇవాళ (శుక్రవారం) సచివాలయంలో కలిశారు.
BC Janardhan Reddy: 2025 జూన్ లోగా రామాయపట్నం పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2019లో సీఎం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. రూ. 4929 కోట్ల వ్యయంతో పోర్ట్ నిర్మాణం కొనసాగుతుంది.
Minister Narayana: రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు అని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు.. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు..
EX MP Harsha Kumar: ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు అని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చింది.. ఆర్టికల్ 351 షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినది.
Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు.
AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆర్డినెన్సుకు సర్కార్ ఆమోదం తీసుకుంది. ఇవాళ రాత్రికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది.
చంద్రబాబు శ్వేతపత్రాలు, జగన్ ప్రకటనలతో ప్రజలు అయోమయంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ రంగంలో దేశ అభివృద్ధి జరిగిందో సీనియర్ నాయకుడు చంద్రబాబు చెప్పాలని అన్నారు.
Home Minister Anitha: ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయి.. కానీ వైసీపీకి అబద్ధపు, ప్రచారాలు నంగనాచి కబుర్లు చెప్పడమే సిద్దాంతం.. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అని ఆరోపించారు.
Minister Nimmala Ramanaidu: 2014 నుంచి 2019 వరకు పోలవరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు 34 సార్లు పర్యటించారు అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తన హయాంలో 72 శాతం పోలవరాన్ని పూర్తి చేశారు..