Pawan Kalyan: మంత్రులను మాయ చేసేలా అధికారుల సమాచారం.. డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి..!
- అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ..
- మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని విమర్శలు..
- ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటోన్న మంత్రులు..
- గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అధికారుల తీరు మీద రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ కొనసాగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు. ఇక, గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా అవును.. కాదు.. ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారులను ఉప ముఖ్యమంత్రి అడిగారు.
Read Also: Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?
Also Read
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
- Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఇక, అనుబంధ పత్రాల్లో కాకుండా.. సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు పైనా అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎంత మాత్రం మళ్లించ లేదని సదరు అధికారులు సమాచారమిచ్చారు.. అధికారుల సమాచారానికి భిన్నంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సభలో సమాధానం ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేదని మంత్రి డోలా పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!