Manchu Manoj with Bhuma Mounika to meet Chandrababu today: ఈ మధ్యనే మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి- భూమా శోభా దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనికను ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రెండు కుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఆ తర్వాత భూమా మౌనికది పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో మంచు మనోజ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు.
పేద, బడుగు వర్గాల వారి ముఖ్యమంత్రి జగన్ అహ్నరిశలు కృషి చేస్తున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు.
టీడీపీ ఎందుకిలా అసత్యాలు ప్రచారం చేస్తుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. రాష్ట్రం దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం.. పదవుల్లో సైతం మహిళకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.. పవన్, చంద్రబాబు, లోకేష్ వాలంటీర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇప్పుడు తోక ముడిచారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది... చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
చంద్రబాబు రోజూ గంట సేపు ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఉన్నారని.. జగన్ రాయలసీమ ద్రోహి అని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారంలో నుంచి దింపకపోతే రాయలసీమను రత్నాల సీమగా మార్చేవాడట చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు.