Minister Kottu Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా ఉందన్న ధైర్యం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ కార్డులా మార్చాడని అప్పుడు ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని.. చంద్రబాబు గురించి వంద పుస్తకాలు రావచ్చని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కొడుకు మాలోకమంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా దర్శి యువగళమా.. గరళగళమా అన్నది తనకు తెలియటం లేదన్నారు.
Also Read: CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు
పవన్ కళ్యాణ్‌ని చూస్తే జాలేస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసని.. కాపులని తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే వరకు కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారని.. పవన్ స్టార్ నుంచి ప్యాకేజ్ స్టార్‌గా మారిపోయాడన్నారు. పార్టీ పెట్డిన ధ్యేయమే వైఎస్ జగన్‌ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడని.. పవన్‌పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.