జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేంది వారాహి యాత్ర కాదు నారహి యాత్ర అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పవన్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి.. పవన్ కళ్యాణ్ ను చూసి మోడీ మొహం చాటేశారు.. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా..? అని కేఏ పాల్ అడిగారు.
చంద్రబాబు పర్యటనలో ప్రసంగించిన తీరు వివాదస్పదంగా మారింది అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కామెంట్స్.. ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. పుంగనూరు పర్యటనలో మాటలతో మొదలైన వివాదం చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది అని మంత్రి తెలిపారు.
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు అంబటి రాంబాబు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.