Karumuri Nageswara Rao: మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆర్భాటం లేకుండా పనులు చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 3సార్లు ముఖ్యమంత్రి అయినా ఏం చేశారంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.
Also Read: Vijayawada : హృదయవిదారకం.. కన్నకొడుకుకు తల కొరివిపెట్టిన తల్లి..
అవినీతికి తావులేకుండా జగన్మోహన్ రెడ్డి పనులు చేస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని బురద చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 23 సీట్లు కాదు కదా.. ఈ సారి ఒక్క సీటు కూడా రాదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ తలుపులు మూసుకోబోతున్నాయన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ మంత్రి అన్నారు. రాయలసీమలో పుట్టి రాయలసీమనే అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలుచిపోతాడన్నారు. రెండు వేల నోట్లు తన వల్లే క్యాన్సల్ అయ్యింది అంటూ చంద్రబాబు మాట్లాడతారని.. ఆయనకు చిన్న మెదడు చితిగిపోయిందేమో అని మంత్రి ఎద్దేవా చేశారు. ఆయన ఏం మాట్లాడుతిన్నాడో ఆయనకే అర్థం కావడం లేదు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.