Chandrababu: పుంగనూరు పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తన పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణలు, ఆ తర్వాత జరిగిన విధ్వంసంపై సీరియస్‌గా స్పందించిన చంద్రబాబు.. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందోచూశారుగా.. పిల్లి కూడా రూమ్‌లో పెట్టి కొడితే పులి అవుతుందన్నారు. మీరు కర్రలతో వస్తే.. మేం కర్రలతో వస్తాం.. మీరు యుద్ధం చేస్తే.. నేనూ యుద్ధం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది.. పుంగనూరులో అదే జరిగిందని వ్యాఖ్యానించారు.
ఈ రోజు జరిగిన విధ్వంసాన్నికి కారణం మంత్రి పెద్దిరెడ్డియే అన్నారు చంద్రబాబు.. ఈ రోజు ఘటనపై విచారణ జరపాలి, బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పెద్దిరెడ్డి తాత జాగీరా..? పెద్దిరెడ్డి పెద్ద పుండింగా..? ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో చూశారుగా..? ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు నరకాన్ని చూసారు.. పిల్లి కూడా రూమ్ లో పెడితే కొడితే పులి అవుతుంది… పుంగనూరులో అదే జరిగిందన్నారు.. దెబ్బలు తగిలిలా.. తలలు పగిలినా.. భయపడకుండా ఉన్నారు. పెద్దిరెడ్డికి చల్లా బాబుకు సరైనా మొగుడు దోరికాడు అన్నారు. మంచివాడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపించారని వ్యాఖ్యానించారు.
ఇక, టైం చెప్పండి.. ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం.. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టానంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.. వైసీపీ నేతలు మగాళ్లు అయితే పోలీసుల్ని పెట్టుకోకుండా రండి అంటూ సవాల్ చేశారు. మరోవైపు డీఎస్పీ బట్టలు తీసేయండయ్యా.. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అని మండిపడ్డారు. నా మీదే దాడి చేస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఉందా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రావణాసురుడు లాంటి ఎమ్మెల్యే ఉన్నాడు.. అతను ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. ఇతని అరాచకాలు హద్దు మీరాయి.. రాక్షసుడి కంటే హీనంగా ఉన్నాడు.. మిమ్మల్ని జైలుకు పంపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు ఒక రౌడీ ఉన్నాడు.. అక్కడికి వెళ్లి తేల్చుకుందాం.. అంటూ పుంగనూరుకు బయల్దేరే ముందు వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు.