Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్, శాఖ మంత్రి అంబటి రాంబాబు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండిపోతోంది.. పవన్ తాజాగా నటించిన బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర వివాదానికి కారణం కాగా.. అప్పటి వరకు ఓ స్థాయిలో జరిగిన మాటల యుద్ధం.. ఆ తర్వాత చిచ్చు రాజేసింది. పవన్ కల్యాణ్ కావాలనే తనను కించపరిచే విధంగా సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేశారని మండిపడుతున్నారు అంబటి రాంబాబు.. ఇక, ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
Read Also: Moranchapalli: మోరంచపల్లిలో ఉద్రిక్తత.. తక్షణ సాయం అందించాలని రాస్తారోకో
ఇక, బ్రో సినిమా గురించి నేను మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి..? అంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ చలవ వల్లే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి.. 14 ఏళ్లలో ఒక్క ఎకరాకు కూడా బాబు నీరు ఇవ్వలేదు.. 14 ఏళ్లలో చేయలేని వారు, ఇప్పుడు ఏం చేస్తారు ? అంటూ ధ్వజమెత్తారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశా, పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరానని తెలిపారు. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు.. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీ వేశాం.. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు 2500 కోట్లు ఖర్చు అవుతుంది.. దీనికి చంద్రబాబు కారణం అంటూ ఆరోపించారు.
Read Also: Postal Jobs : పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు.. పది అర్హతతో..
చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు.. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాలలో పైకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది అంటూ దుయ్యబట్టారు. పోలవరం 2018 కల్లా చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు ? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారు ? రాయల సీమలో ఒక్క ప్రాజెక్టుకు అయినా బాబు శంకుస్థాపన చేశారా ? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి అంబటి రాంబాబు.