చిత్తూరు జిల్లా పుంగనూర్ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. సీఎం జగన్ తన సుదీర్గ పాదయాత్రలో ఎక్కడా కత్తులు, కటార్లతో అల్లర్లకు పాల్పడ లేదు అని ఆయన కామెంట్స్ చేశారు.
టీడీపీ పెత్తందార్ల వైపు.. మేము పేదల వైపు ఉన్నామని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే మోకాలడ్డి చంద్రబాబు శునకానందం పొందుతున్నాడు. అమరావతి మీ అడ్డా కాదు.. మా బిడ్డలు ఉంటారు.. ఈ యుద్ధంలో మేం కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులపై దాడి చేయడం అమానుష చర్య అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అని హోంమంత్రి పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడి చేయించడం అమానుషం.. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. టీడీపీ శ్రేణుల దాడులు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కనిపిస్తుంది అని ఎంపీ భరత్ ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేంది వారాహి యాత్ర కాదు నారహి యాత్ర అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పవన్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి.. పవన్ కళ్యాణ్ ను చూసి మోడీ మొహం చాటేశారు.. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా..? అని కేఏ పాల్ అడిగారు.
చంద్రబాబు పర్యటనలో ప్రసంగించిన తీరు వివాదస్పదంగా మారింది అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కామెంట్స్.. ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. పుంగనూరు పర్యటనలో మాటలతో మొదలైన వివాదం చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది అని మంత్రి తెలిపారు.
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.