జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు చిత్తూరు జిల్లా పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ.. సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని నిప్పులు చెరిగారు. breaking news, latest news, telugu news, big news, karumuri nageswara rao, pawan kalyan, chandrababu
గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్ లపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎప్పుడూ మన మీద ప్రేమ ఉండదని ఆరోపించారు. కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్‌గా మాట్లాడారన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరం అంతా పరిశీలించారని, సెల్ఫీ కూడా తీసుకున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు.