టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్ లపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే పనులు చేస్తామంటున్నారు.. అసలు 14 ఏళ్ల చరిత్రలో ఒక్క ప్రాజెక్టు అయినా శంకుస్థాపన చేసింది.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఉందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఒకే సారి నువ్వు, నీ దత్తపుత్రుడు రావాల్సిన అవసరం ఏముందని మంత్రి సీదిరి అన్నారు. విశాఖ పై బురద జల్లడమే మీ ప్రయత్నమని మంత్రి విమర్శించారు. ఉత్తరాంధ్ర పై వైసీపీ చిత్త శుద్ధితో ఉందని ఆయన తెలిపారు. అందుకే విశాఖని రాజధానిగా ప్రకటించామన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Mehar Ramesh: ఓ శక్తి.. ఓ షాడో.. ఓ భోళా.. స్టార్స్ కు ప్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే
మరోవైపు పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములుకి వైఎస్ కి లింక్ పెడుతున్నారు.. అసలు ఆ పోలికేంటని ప్రశ్నించారు. పార్టీ పెట్టాక ఎన్ని పొట్టి శ్రీరాములు విగ్రహాలు చూసారన్నారు. జగన్ సీఎం అయ్యాక.. పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎక్కడ తగ్గాయి పవన్ అని ప్రశ్నించారు. వైఎస్ అభిమానులు విగ్రహాలు పెట్టుకుంటే మీకేంటి బాధ అని సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులే గంజాయి అడ్డాగా విశాఖపట్నం అని మంత్రులు చెప్పారని.. అప్పుడు ప్రశ్నించలేదేం పవన్ అని అన్నారు.
Jeff Bezos Buys Estate: రూ. 560 కోట్లతో లగ్జరీ ఎస్టేట్ కొన్న బెజోస్.. ఎవరి కోసమో తెలుసా?
పార్టీ సిద్దాంతాలను, కార్యకర్తల కష్టాన్ని ప్యాకేజి తీసుకుని అమ్మేసారని పవన్ పై విమర్శలు చేశారు. పవన్ కు జెండా, ఎజెండా లేదు.. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తావన్నారు. చంద్రబాబు వల్ల పవన్ బాగుపడ్డాడుగాని.. వంద కులాలు నష్ట పోయాయని ఆరోపించారు. చంద్రబాబుకు కట్టు బానిస పవన్ అని మంత్రి సీదిరి అన్నారు. విశాఖను రాజధాని కాకుండా ఇద్దరు నేతలు విషం కక్కుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పుంగనూరులో రెచ్చగొట్టింది చంద్రబాబేనని.. ఒల్లు కొవ్వెక్కి మాట్లాడుతుంటే కేసుపెట్టరా అని ఆయన అన్నారు. కోవిడ్ లో నిబంధనలు ఉల్లంగిస్తే తన పైనే కేసులు పెట్టారని.. చంద్రబాబు పైనుండి ఊడీపడలేదు కదా అని ఎద్దేవా చేశారు.