టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు.
kodali Nani fires on Balakrishna over Chandrababu Arrest: స్కిల్ డెవెలప్మెంట్ కేసులో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ స్పందించారు. జగన్ పాలకుడు కాదు కక్షదారుడని, చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గం అని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని, ప్రజా సంక్షేమాన్ని…
దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు.
చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తనది సంపన్న కుటుంబమని.. తాను భూములు కొంటే తప్పా అంటూ మంత్రి ప్రశ్నించారు.