Top Headlines @5PM : టాప్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టంకు ఎవరూ చుట్టం కాదు
చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ దర్యాప్తు ఒక ఏజెన్సీ చేపట్టింది కాదు… ED, IT, GST, సెబీ వంటి సంస్థలన్ని చేపట్టాకే ప్రభుత్వం కన్ఫర్మ్ చేసిందని తెలిపారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కాం పురుడు పోసుకుందని చెప్పారు. ఈ స్కాంపై టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2017లో ACB కి ఫిర్యాదు వెళ్ళిందని.. విచారణ చేపట్టకుండా, అసెంబ్లీలో చర్చించకుండా తేలు కుట్టిన దొంగలులాగా దాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. ఇది జరిగిన వెంటనే ప్రాజెక్ట్ నోట్ ఫైల్ ను మాయం చేశారని.. కేబినెట్ లో పెట్టింది ఒకటి.. బయట వీరు చేసిందొకటని స్పీకర్ సీతారాం మండిపడ్డారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును కాసేపట్లో విజయవాడలోని సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. 3వ అదనపు జిల్లా, ఏసీబీ కోర్టు జడ్జి వద్ద చంద్రబాబును హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు కోర్టు వద్ద మోహరించారు. స్పెషల్ పార్టీ, టాస్క్ ఫోర్స్, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ బెటాలియన్ లతో రక్షక వలయంగా ఉన్నారు.
‘ఇంకా చాలా మంది బయటకు వస్తారు’
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిపోయాయి. బాణాసంచా కాల్చి పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నాయి.
డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‌గా కూడా నిర్మాణాలు జరగాలి
డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‌గా కూడా నిర్మాణాలు జరగాలని ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని కేటీఆర్ అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మొత్తం మీద పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమతూకం చేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో-2023ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అన్ని రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాకముందు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉండేదని, పవర్ హాలిడేలతో పరిశ్రమలకు సెలవులు ఇచ్చేవారన్నారు. జిరాక్స్ సెంటర్ నడపడానికి కూడా కరెంటు లేదన్నారు. కానీ, నేడు రాష్ట్రంలో 26 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. గతంలో హైదరాబాద్ నగరంలో నిత్యం తాగునీటి సమస్య ఉండేదని, సీఎం కేసీఆర్ దార్శనికతతో కృష్ణా, గోదావరి నదుల నుంచి వందల కిలోమీటర్ల మేర నీటిని తీసుకొచ్చి నగరవాసులకు తాగునీరు అందించడం జరిగిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా 10 శాతం తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో తాగునీటికి కొరత ఉండదని స్పష్టం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు. అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని.. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాత మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
బాలకృష్ణపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ స్పందించారు. జగన్ పాలకుడు కాదు కక్షదారుడని, చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గం అని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారని విమర్శించిన బాలక్రినా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలవడం ఖాయం.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల బరిలో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. 4 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. అయితే.. అంతేకాకుండా.. ప్రకటించిన 115 స్థానాల్లో ఏడుగురు సిట్టింగ్‌లను మార్చుతూ ప్రకటన చేశారు. అయితే.. పెండింగ్‌లో ఉంచిన 4 స్థానాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జనగాం ఒకటి. అయితే.. ఈసారి ముత్తిరెడ్డికి కాకుండా జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియా ముఖంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ సారి కూడా తనకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
టెట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన ప్రభుత్వం..
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లో భాగంగా ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2023) ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా..దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16న ముగిసింది.దరఖాస్తు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.. టెట్ పరీక్ష ను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.దీనిలో భాగంగానే అధికారులు నేడు టెట్ హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోగలరని అధికారులు తెలియజేసారు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించి.. తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెస్టెంబర్ 15 వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్షను , అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను ను నిర్వహించనున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 27న ఫలితాలను విడదుల చేస్తామని అధికారులు నోటిఫికేషన్లో వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!