చంద్రబాబు అరెస్ట్ పై టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు, పన్ను పోటు అని ఆరోపించారు. తన జీవితం అంతా దుర్మార్గాలు చేసిన వ్యక్తి చంద్రబాబని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆదర్శ ప్రాయుడు కాని రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు మాత్రమే విమర్శించారు. జనం సొమ్ము తింటే న్యాయం నిలదీస్తుందని భూమన అన్నారు. ఆందోళనలు చేస్తే చంద్రబాబుకు సానుభూతి రాదు.. దేశంలో ప్రజాదరణ లేని నేత చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు.
Read Also: G20 Dinner: జీ20 ప్రత్యేక విందు కోసం భారత్ మండపంలో ప్రపంచ నాయకులు
చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ ను ఒక వీరుడుగా భావిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు జీవితం అంతా మచ్చలే.. ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నావని కాదు, ఎంత నిజాయితీగా ఉన్నావన్నది ముఖ్యమన్నారు. సోనియాతో కలిసి.. సీబీఐని ఉసిగొలిపి, తప్పుడు కేసులు మోపి జగన్ ను చంద్రబాబు జైలుకు పంపారని అన్నారు. ఈ తప్పు చేసినందుకు చంద్రబాబుకు పడిన శిక్ష అని పేర్కొన్నారు. సీఐడీని అభినందించాలని భూమన తెలిపారు. అవినీతి పరుడిని సమర్థించే వారంతా చట్టం ముందు దోషులేనని భూమన తెలిపారు.
Read Also: Trisha : త్రిషకు ముద్దు పెట్టడానికి నిరాకరించిన ఆ స్టార్ హీరో..
చంద్రబాబు అరెస్ట్ చట్టబద్దం.. న్యాయమైన చర్య అని అన్నారు. పెగాసస్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర పై కూడా మరింత విచారణ జరపాల్సి ఉందని భూమన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అవినీతిని సమర్ధిస్తున్నాడని మండిపడ్డారు. అలిపిరిలో చంద్రబాబు పై క్లైమోర్ మెన్ బాంబు దాడి, హత్య ప్రయత్నం చేస్తే దగ్గరలో ఉన్న టీ షాపు వాడు కూడా సానుభూతి చూపలేదని తెలిపారు. ఆయన అరెస్ట్ చేస్తే వస్తుందా అని అన్నారు. మరుసటి రోజు ఉదయం చంద్రబాబు పై హత్య ప్రయత్నం పై వైఎస్సార్, తాను నిరసన తెలిపామన్నారు. ఇసుక నుంచి తైలం తీయవచ్చు, చంద్రబాబు అరెస్ట్ ద్వారా సానుభూతి రాదని పేర్కొ్న్నారు.