టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు.
రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక బిల్డింగ్ లు కట్టి వందల కోట్ల రూపాయలను కొట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు శాశ్వత భవనాలు కట్టి ఉంటే ఎన్ని లక్షల కోట్ల ముడుపులు తీసుకునే వారో అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందన్నారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది అని మంత్రి కొట్టు పేర్కొన్నారు.
ప్రతీసారీ తప్పించుకుని పోతున్నాడు.. ఏదో రకంగా కోర్టులను మేనేజ్ చేసుకుంటూ మనుగడ సాగించాడు.. ఇవాళ దొంగ దొరికాడు.. ముందు నుంచి మేము ఏదైతే చంద్రబాబు గురించి చెబుతున్నామో అదే నిజమని తేలింది.. చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం అని ఆయన పేర్కొన్నారు.